వాసవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణితో కలిసి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి నమస్కరించారు. అనంతరం దేవస్థాన పూజారులు ఎమ్మెల్యే దంపతులను వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించి సత్కరించారు.