నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

NLG: దేవరకొండలో పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ రాజేష్ తెలిపారు. అయ్యప్ప దేవాలయం ముందు కరెంటు స్థంభం షిఫ్టింగ్ కారణంగా అంతరాయం కల్గుతుందని వెల్లడించారు. పట్టణంలోని మెయిన్ రోడ్ వెంబడి, BNR కాలనీ, ముత్యాలమ్మ బజార్, గాంధీ బజార్ ఏరియాలకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.