ఓపెన్ డ్రింకింగ్.. 178 కేసులు నమోదు
GNTR: ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని పీఎస్‌ల పరిధిలో 'ఓపెన్ డ్రింకింగ్'పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీలను సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించగా, మొత్తం 178 మందిపై కేసులు (8 FIR కేసులు, 170 పెట్టి కేసులు) నమోదైనట్లు అధికారులు తెలిపారు. బహిరంగ మద్యపానంపై కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.