నేడు మండల సర్వసభ్య సమావేశం
ప్రకాశం: వెలిగండ్ల సర్వసభ్య సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రామన మహాలక్ష్మి అధ్యక్షతన జరుగుతుందని ఎంపీడీవో షేక్ మహబూబ్ బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సమావేశానికి వచ్చేటప్పుడు మండల స్థాయి అధికారులు శాఖల వారీగా పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. హాజరుకాని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.