'గుంతలమయంగా రోడ్డు.. పూర్తయ్యేదెన్నడో'

'గుంతలమయంగా రోడ్డు.. పూర్తయ్యేదెన్నడో'

RR: కేశంపేట మం.మంగళ్ గూడ గ్రామం నుండి లింగంధన వరకు రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బీటీ రోడ్డు పనులను కాకునూరు గ్రామం వరకు పూర్తి చేశారు. అయితే లింగంధనలో బీటీ రోడ్డు పనులు నిలిచిపోవడంతో రోడ్డుపై గుంతల్లో వర్షపునీరు నిలవగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు రోడ్డు పనులను పూర్తిచేయాలని కోరుతున్నారు.