సమస్యలపై చర్చిస్తా: మేయర్

VSP: ఆరిలోవ రామకృష్ణాపురం గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు మేయర్ పీలా శ్రీనివాసరావును కోరారు. ఆదివారం గోడ కూలిన ప్రదేశాన్ని, వరద ప్రభావిత ప్రాంతాలను మేయర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌కు స్థానిక సమస్యలు వివరించారు. గ్రామంలో రోడ్లు, మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.