జిన్నారం రైతుల నిరసన

SRD: తమకు న్యాయం చేయాలని కోరుతూ జిన్నారం రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సర్వే నెంబర్ 1లో నాలుగు సంవత్సరాల క్రితం తమ భూములు తీసుకున్నారని రైతులు తెలిపారు. 600 గజాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం సమర్పించారు.