నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

జగిత్యాలలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 17న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీ. సత్యమ్మ తెలిపారు. జంబోటైల్ టెక్నాలజీస్, ఫోన్‌పే సంస్థల్లో మొత్తం 100 ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. SSC, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలన్నారు.