భీమ్ గల్ యువతి ఆత్మహత్య
NZB: భీమగల్ పట్టణానికి చెందిన అమ్మాయి శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మొర్రి ప్రణవి(22) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.