VIDEO: బస్సులో ఘర్షణ.. కండక్టర్‌పై మహిళ ఆగ్రహం
WGL: పర్వతగిరి ప్రాంతంలో బస్సు కండక్టర్‌తో మహిళా ప్రయాణికురాలి మధ్య వివాదం చోటుచేసుకుంది. బస్సు ఎక్కేందుకు ఆలస్యంగా వచ్చిన కుటుంబాన్ని గమనించకుండానే కండక్టర్ బస్సును ముందుకు కదిలించడంతో మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కండక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.