ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందుర్తి మండలం బండపల్లిలో జరిగింది. ఎస్సై రమేష్ కథనం ప్రకారం మండలంలోని బండపల్లి గ్రామానికి చెందిన నేదూరి అంజవ్వ(55) అనే మహిళాను అప్పులిచ్చిన వారు డబ్బులు చెల్లించాలని కోరితే కుమారులు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనై ఇంట్లో దూలానికి ఉరి వేసుకుంది.