అంగన్వాడీ కేంద్రంలో కిశోరి వికాసం కార్యక్రమం

AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ సీడీపీఓ సువార్త ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో కిశోరి వికాసం వేసవి సెలవుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 15 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. బాల్య వివాహాల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లిళ్లు చేసుకోవద్దని సూచించారు.