రోడ్డు ప్రమాదం.. తల్లి కొడుకులకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. తల్లి కొడుకులకు గాయాలు

KNR: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన సూత్రపు అనిల్ (27) తన తల్లి స్వరూప (55)తో కలిసి బైక్‌పై వెళ్తుండగా అంబాల్పూర్ కొత్త బ్రిడ్జి వద్ద వారిని గూడ్స్ ఆటో ఢీట్టింది. ఈ ఘటనలో అనిల్‌కు ఎడమ కాలికి గాయం కాగా, స్వరూపకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించి, హాస్పిటల్‌కి తరలించారు.