డీవైఈవోగా ఇందిరా బాధ్యతలు స్వీకరణ

CTR: చిత్తూరు డివిజన్ డీవైఈవోగా రొంపిచర్ల మండలం ఎంఈఓ ఇందిరా బుధవారం బాధ్యతలు చేపట్టారు. రొంపిచర్ల-1 ఎంఈఓగా పనిచేస్తున్న ఇందిరాకు చిత్తూరు డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ముందుగా ఆమె ఆలయంలో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.