అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం

AP: శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి 1,700 మందికిపైగా క్రీడాకారులు తిరుపతికి చేరుకున్నారు.