రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

CTR: పలమనేరు నుంచి చిత్తూరు వెళ్లే ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సామర్లగడ్డ గ్రామానికి చెందిన పవన్ (ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగి) అక్కడికక్కడే మృతి చెందారు. వృత్తి నిమిత్తం బైక్ పై ప్రయాణిస్తుండగా, మొగిలి ఘాట్ వద్ద ట్రైన్ చక్రాలు తరలిస్తున్న లారీ ఢీకొనడంతో ఘటన చోటు చేసుకుంది. అకాల మరణంతో పవన్ కుటుంబం కన్నీటి పర్యంతమైంది.