ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తాం: మంత్రి
AP: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. తానూ రైతు బిడ్డనేనని, వారి కష్టాలు ఏంటో తనకు బాగా తెలుసని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అన్యాయం జరగకూడదని, జరిగితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.