'ప్రైవేటీకరణ ఆలోచనను మార్చుకోవాలి'
PPM: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి అన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ శెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం కురుపాం పంచాయతీ టేకరకండి గ్రామాల్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు.