బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

బస్సు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

మర్కాపురం జిల్లా బస్సు ప్రమాద ఘటనపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 13 మంది మృతి చెందడంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలను ఆరా తీసి, మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్న సమాచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు.