సర్పంచ్ అభ్యర్థిగా సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నిక

సర్పంచ్ అభ్యర్థిగా సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నిక

KMM: తిరుమలాయపాలెం మండలంలో స్థానిక ఎన్నికల సందర్భంగా తిమ్మక్కపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రేపాకుల సుభద్ర ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నికయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ప్రజాపంథా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజల అభిప్రాయం మేరకు ఈ ఏకగ్రీవం జరిగింది. మండలంలో తొలి సర్పంచ్ అభ్యర్థి సుభద్ర కావడం విశేషం అని స్థానికులు హర్షణ వ్యక్తం చేశారు.