MBNR: ఈ నెల 14న ఎన్టీఆర్ కళాశాలలో ఉద్యోగమేళా

MBNR: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 14న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. TSKC, ప్లేస్మెంట్ సెల్ సౌజన్యంతో పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఏదైనా డిగ్రీ ఉన్న వారు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.