VIDEO: అర్ధవీడులో వన్యప్రాణుల లెక్కింపు కార్యక్రమం
ప్రకాశం: అర్థవీడు నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల లెక్కింపు (సెన్సస్) కార్యక్రమాన్ని డీఆర్వో ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. పులుల పాదముద్రలను గుర్తించి, వివరాలను నమోదు చేశారు.పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, రేసు కుక్కలు వంటి మాంసాహార వన్యజీవుల ఆధారాలను ఎకలాజికల్ యాప్లో నమోదు చేసినట్లు తెలిపారు. మూడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.