VIDEO: సిద్దుల గుట్టకు పోటెత్తిన భక్తులు

VIDEO: సిద్దుల గుట్టకు పోటెత్తిన భక్తులు

NZB: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ సిద్దులగుట్ట సోమవారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారి దర్శనానికి చుట్టుపక్కల జిల్లాల నుండి భక్తులు తరలివచ్చారు. సిద్దేశ్వరునికి పల్లకి సేవ కోనేరు వరకు నిర్వహించారు. శ్రీ రామాలయం, దుర్గామాత, ఎల్లమ్మ తల్లి, అయ్యప్ప, ఏకశిలా హనుమాన్ దేవాలయాలను సైతం భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమం చేశారు.