చలి తీవ్రత.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
TG: చలిగాలుల తీవ్రతతో రాష్ట్రంలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. సిరిసిల్ల 8, జగిత్యాల 8.6 రికార్డ్ అయ్యాయి. ఇవాళ కూడా గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, నాటి నుంచి వర్షాలు పడతాయని తెలిపింది.