మహిళా దినోత్సవం రోజున టీవీకే మేనిఫెస్టో?
మహిళా దినోత్సవం రోజున టీవీకే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో కోసం ఆ పార్టీ అధినేత విజయ్ నియమించిన కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. మహిళలను ఆకర్షించే పలు ప్రకటనలు, జాలర్లు, రైతులు, యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందేల పథకాలు ఉండేలా మేనిఫెస్టోను రూపొందించారని.. ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు సమాచారం.