హెల్మెట్ వినియోగంపై అవగాహన
ELR: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పని సీఐ బాల సురేష్ పేర్కొన్నారు. ఇవాళ కొయ్యలగూడెం గణేష్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న 50 మందికి పైగా వాహనదారులను గుర్తించి, అక్కడికక్కడే వాటిని కొనుగోలు చేయించారు. ఇప్పటివరకు 200 మందికి పైగా హెల్మెట్లు కొనుగోలు చేయించామన్నారు.