నందలూరు చెరువును పరిశీలించిన కలెక్టర్

నందలూరు చెరువును పరిశీలించిన కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో "మొంథా" తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజంపేట మండలంలోని నందలూరు కన్యక చెరువును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, అడిషనల్ ఎస్పీ మనోజ్ కుమార్‌లతో కలసి పరిశీలించారు. ప్రజల భద్రతకు సంబంధించిన చర్యలను అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.