టీడీపీ నేత పొలంలో క్షుద్ర పూజల కలకలం

టీడీపీ నేత పొలంలో క్షుద్ర పూజల కలకలం

KRNL: పెద్దకడబూరు మండలం జాలవాడికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముక్కన్న పత్తి పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం క్షుద్ర పూజలు చేశారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపుతుంది. మూడు నెలల క్రితం ముక్కన్న ఇంటి ముందు క్షుద్ర పూజలు చేసిన దుండగులే ఇప్పుడూ పత్తి పొలంలో చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై ముక్కన్న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.