నేడు జలుమూరులో పర్యటించనున్న ఎమ్మెల్యే
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రవణమూర్తి శుక్రవారం జలుమూరు మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మండలంలోని పలు గ్రామాల్లో రూ. 8.47 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కావున, స్థానిక కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని కోరారు.