రోడ్డుపై పశువులు.... తరచూ ప్రమాదం

రోడ్డుపై పశువులు.... తరచూ ప్రమాదం

VZM: బొబ్బిలి పట్టణాల్లో వీధుల వెంట తిరిగే పశువుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాత్రింబవళ్లు తేడా లేకుండా రహదారులపై సంచరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్లు, కూరగాయల విపణులు వాటికి ఆవాసాలుగా మారాయి. రాత్రి వేళల్లో రోడ్డుపై సేద తీరే పశువులు వాహనదారులకు దూరం నుంచి సరిగ్గా కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.