కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఇవాళ 13వ డివిజన్ అభ్యర్థి జానకి మోహన్ రెడ్డి విజయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భారీ రోడ్ షో నిర్వహించి, ప్రచారం చేపట్టారు. డివిజన్‌లోని మౌలిక వసతుల మెరుగుదల కాంగ్రెస్‌తోనే సాధ్యం అని అన్నారు. ఈనెల 11న జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.