ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్
MBNR: జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్‌లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.