'కోటి సంతకాలతో కూటమి కుట్రలు నిలదీద్దాం'
KRNL: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రలను నిలదీద్దామని మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య అన్నారు. మంత్రాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన మంగళవారం కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే జరిగే అనర్థాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు.