రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు
SKLM: నరసన్నపేట పట్టణం లచ్చుమన్నపేట సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండిపోవడంతో రోడ్లమీద మురుగునీరు ప్రవహిస్తుందని స్థానికులు అంటున్నారు. దీంతో దుర్వాసన అధికంగా వస్తుందని, కాలినడకన వెళ్లే వాళ్ళ అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.