'బహుజన రాజ్యం కోసం సర్దార్ పాపన్న సేవలు చిరస్మరణీయం'

'బహుజన రాజ్యం కోసం సర్దార్ పాపన్న సేవలు చిరస్మరణీయం'

NLG: సర్దార్ పాపన్న సేవలు చిరస్మరణీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా నకిరేకల్ మెయిన్ సెంటర్ లో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బహుజన రాజ్యం కోసం జీవితాన్నే త్యాగం చేశారని, నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు.