ఈనెల 30 వరకు 30 పోలీసు యాక్ట్ అమలు
ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ప్రజాసంఘాలు, కార్మిక యూనియన్లు, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.