పెను విషాదం.. 8 మంది మృతి

పెను విషాదం.. 8 మంది మృతి

చైనా బీజింగ్‌లోని ఓ గ్రామీణ మార్కెట్‌లో పెను విషాదం జరిగింది. వేగంగా వచ్చిన బుల్డోజర్ ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.