వల్లభనేని వంశీని కలిశారంటూ దాడి. ?
కృష్ణా: గన్నవరం(M) మర్లపాలెంలో రాజకీయం ఉద్రిక్తతకు దారితీసింది. వల్లభనేని వంశీని కలిశారనే అక్కసుతో శ్రీధర్, రామ్మోహనరావులపై కొందరు హాకీ స్టిక్స్ దాడి చేసినట్లు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వంశీ మర్లపాలెం వెళ్లగా,వారిద్దరు ఆయన్ను కలిశారు. దీనిపై కక్ష పెంచుకొని దుండగులు దాడి చేయడంతో గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.