గౌడన హళ్లిలో APIICకి భూమి కేటాయింపు

సత్యసాయి: జిల్లా మడకశిర మండలం గౌడన హళ్లి గ్రామంలో APIICకి 5.97 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సర్వే నం.167-2లో 1.96 ఎకరాలు, 171-3లో 4.01 ఎకరాలు పారిశ్రామిక వాడ కోసం ఎకరానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించాలని కలెక్టర్ చేతన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను APLMA ఆమోదించింది.