పాక్ పై భారత్ దాడి.. స్పందించిన కేంద్రమంత్రి

SKLM: భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడుల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఈ దాడిపై శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అనంతరం ఆయన ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించేదే లేదని దీటుగా బదులిచ్చారు. అనంతరం భారత్ మాత వర్ధిల్లాలి అన్నారు.