దాన్ని యూట్యూబ్‌లో పెడతాడేమో అనుకున్నా: షారుఖ్

'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం తన కుమారుడు ఆర్యన్ ఖాన్ నాలుగేళ్లు కష్టపడ్డాడని తెలిపారు. కొత్తగా ప్రయత్నించాలని ఉందని తనతో చెప్పినప్పుడు.. తమ ఇల్లు CCTV ఫుటేజ్ యూట్యూబ్‌లో పెడతాడేమోనని భయపడ్డానని చెప్పారు. ఈ మూవీని చూసి షాకయ్యానని, నిజంగా కొత్తగా ట్రై చేశాడని పేర్కొన్నారు.