VIDEO: కేటీఆర్ సభలో గందరగోళం.. డబ్బుల కోసం పట్టుబట్టిన ప్రజలు

JDWL: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పర్యటన సందర్భంగా గద్వాలలో ఏర్పాటు చేసిన సభలో గందరగోళం నెలకొంది. సభకు హాజరైన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు తమకు డబ్బులు ఇవ్వాలని గ్రామ స్థాయి నాయకులను నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. పార్టీ శ్రేణులు ప్రజలను సభకు తీసుకురావడానికి కూలీలు, పాఠశాల విద్యార్థులను ఉపయోగించుకున్నారని ప్రతి పక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు.