VIDEO: పీకల వాగులో కుప్పలుగా పేరుకుపోయిన చెత్త
గుంటూరులో పారిశుద్ధ్యంపై తీవ్ర నిర్లక్ష్యం బయటపడుతోంది. కమ్మ శేషయ్య గ్రౌండ్ సమీపంలో పీకల వాగులో చెత్త పేరుకుపోవడంతో వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు విస్తరించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వెంటనే శుభ్రత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.