ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన DIEO

WNP: గోపాల్ పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో మాట్లాడిన ఆయన, క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని, పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి విద్యార్థులకు ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు చేయనున్నట్లు తెలిపారు.