పాక్ తప్పుడు ఆరోపణలను ఖండించిన భారత్

పాక్ తప్పుడు ఆరోపణలను ఖండించిన భారత్

పాకిస్తాన్(ఇస్లామాబాద్)లో జరిగిన దాడిలో భారత్ ప్రమేయం ఉందన్న ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్‌లో జరుగుతున్న సైనిక విధ్వంసం, అధికార దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే భారత్‌పై పాక్ తప్పుడు కథనాలు కల్పిస్తోందని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విమర్శించారు. పాక్ కుట్రలతో అంతర్జాతీయ సమాజం తప్పుదారి పట్టదని ఆయన స్పష్టం చేశారు.