భూసార పరీక్షలపై రైతులకు అవగాహన

NLR: కొడవలూరు మండలం ఎల్లాయపాలెంలో సోమవారం భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు సోదరులందరూ తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను పంటకు వేసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మి, ఏఈఓ వెంకట్రావు పాల్గొన్నారు.