కావాలనే మా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు: విజయ్
ఎన్నికల ప్రచార సభల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకున్నా.. చివరి నిమిషంలో అనుమతిని నిరాకరిస్తున్నారని ఈసీ దృష్టికి టీవీకే అధినేత విజయ్ తీసుకెళ్లారు. డీఎంకే ప్రభుత్వం కావాలనే అధికారుల ద్వారా తమ ప్రచారాన్ని అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఈ చర్యను ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.