ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ.. 27న డ్రా

ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ.. 27న డ్రా

SRPT: సూర్యాపేట జిల్లాలో 93 వైన్స్‌లకు 2,771 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గడువు పెంచిన తర్వాత 154 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున రూ.83.13 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 99 వైన్స్‌లకు 4,338దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 186.76 కోట్ల ఆదాయం లభిచింది. ఈనెల  27న డ్రా ఉంటుంది.