ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రకాశం: దోర్నాల మండలం ఐనముక్కల గిరిజన బాలికల గురుకుల పాఠశాల 2025-26 విద్యా సంవత్సరానికి 3 నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శనివారం ప్రిన్సిపల్ తెలిపారు. ఉచిత విద్య, భోజనం, వసతితోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందవచ్చన్నారు. మొత్తం 66 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మే 25లోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.