తాళాలు పగులగొట్టి బంగారు గొలుసు చోరీ
W.G: జంగారెడ్డిగూడెం కొత్తపేటలో తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు రెండు కాసుల బంగారు గొలుసు అపహరించారు. బ్యాగుల తయారీ పనులు చేసే గుర్రం శాంతి, వీరభద్రం దంపతులు ఈ నెల 11న షాపుకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి తలుపులు, బీరువా తెరిచి ఉన్నాయి. అందులోని గొలుసు మాయమైనట్లు గుర్తించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ఎస్సై ప్రసాద్‌కు పిర్యాదు చేశారు.